24 April, 2026 | 2:39 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •  

నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించాలి

19-11-2025 05:56 PM

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి..

సదాశివనగర్ (విజయక్రాంతి): సిడ్స్, పెస్టిసైడ్ దుకాణదారులు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పురుగుమందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. రైతు వేదికలో దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలను నడపవద్దని సూచించారు. రైతులు తీసుకున్న ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదును ఇవ్వాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఏఈఓలు, పెస్టిసైడ్ దుకాణదారులు, డీలర్లు పాల్గొన్నారు.