31 August, 2026 | 10:22 PM

Breaking News

ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి

31-08-2026 10:03 PM

నిరసన తెలిపిన POW జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఆదివాసి మహిళా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాటిగూడెం గ్రామానికి చెందిన,శిరీష అనే నర్సు బతుకుతెరువు కోసం హైదరాబాదులో హాస్పిటల్లో పనిచేస్తుండగా, విశ్రాంతి కోసం రూమ్ కి వెళ్ళిన శిరీషపై విశ్రాంతి గదిలోకి వెళ్లి  అత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి అన్నారు.

కొత్తగూడెం రైటర్ బస్తీలో నిరసన కార్యక్రమం

పీఓడబ్ల్యూ డివిజన్ నాయకురాలు కామ్రేడ్ సంధ్య అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కామ్రేడ్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ... హైదరాబాద్ తుక్కగుడాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్స్ శిరీష శుక్రవారం తన విశ్రాంతి గదిలో ఉండగా సైనా ఉలా అనే వ్యక్తి బలవంతంగా రూమ్ లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడానికి తీవ్రంగా ఖండించాలని ఆమె అన్నారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఆడపిల్ల ఒంటరిగా, బయట తిరిగే పరిస్థితి లేదని  అన్నారు. గతంలో,నిర్భయ మొన్న ఆర్జీకే,ఈరోజు శిరీష, హైదరాబాదులో జరిగే ఘటనలు ఆడపిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, ఆ మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, మహిళలకు పనిచేసే ప్రదేశాలలో బయట రక్షణ కల్పించాలని శిరీషను అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అన్నారు.