జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష
ముకరంపుర, ఆగస్టు 22(విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం బొమ్మకల్ లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని, డిప్లమో విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసిస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేశారని సాంకేతిక విద్యను ప్రైవేట్ పరం చేసె అవకాశం ఉందని కాబట్టి తక్షణమే ప్రభుత్వం తమకు విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నిత్ నాయకులు రిషి ,సాయి తదితరులు పాల్గొన్నారు.






