16 May, 2026 | 9:10 PM

ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన

16-05-2026 08:23 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి గ్యాస్ ధరలు తగ్గించాలను కోరుతూ సిపిఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి లాగుతూ జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నామని మాట్లాడుతున్న బిజెపి ప్రభుత్వం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఎందుకు ఇక్కడ ధరలు తగ్గించలేదో సమాధానం చెప్పాలన్నారు.

కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించని ఎడల ప్రజా ఆగ్రహాన్ని గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు రేగటి లింగయ్య, పట్టణ కార్యవర్గ సభ్యులు చామల అశోక్ కుమార్, దీకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.