28 August, 2026 | 1:54 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఇడుపు కాయితం.. శ్రీలత వస్తోంది!

27-08-2026 12:19 AM

ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి(Director Vamshi Reddy Dondapati) తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో  శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మ్యూజికల్ ప్రోమోషన్స్‌కు తెర తీస్తూ ఈ సినిమా నుంచి ‘శ్రీలత సాంగ్..’ ప్రోమోను రిలీజ్ చేశారు. కొత్తగా పెళ్లయిన జంట శ్రీలత, శ్రీనివాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్‌గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత.. శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత..’ అంటూ సాగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి స్వరపర్చిన ఈ పాట ఫుల్ వెర్షన్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు.