10 August, 2026 | 10:21 AM

ఖానాపూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

06-08-2026 07:30 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. తెలంగాణ సాధనలో ఆయన కృషి ఎంతో ఉన్నత మైనదని  అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ గౌడ్, కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.