2 May, 2026 | 5:32 AM

రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు

02-05-2026 02:05 AM
  1. జొన్న, మొక్కజొన్న పంటలను కొంటున్నాం
  2. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు 
  3. మార్క్ ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): పంటల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంట కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర  ప్రభు త్వమే భారాన్ని భరించి మద్ధతు ధరకు పంటలను సేకరిస్తున్నామన్నారు. శుక్రవారం సచివాలయంలో మార్క్ ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులతో పంటల కొనుగోళ్లపై సమీక్ష మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వమే పంటల కోనుగోళ్ల కోసం ఏటా రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల భారాన్ని భరిస్తోందన్నారు. మొక్కజొన్న, జొన్న వంటి పంటలను కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం విధించిన పరిమి తులకు మించి పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటలను సేకరించామని, జొన్న, మొక్కజొన్న పం టలను కూడా కొనుగోలు చేశామని తెలిపారు.

2023- సంవత్సరంలో రూ. 299 కోట్లతో 93,900 మెట్రిక్ టన్నుల జొన్నలు, 2024 -25 సంవత్సరంలో రూ. 521 కోట్లతో 1.54 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు, 2025 -26 వానాకాలంలో రూ. 903 కోట్లతో 3.77 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, ఈ యాసంగిలో ఇప్పటివరకు రూ. 1044 కోట్ల తో 4.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. త్వరలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, జొన్న పం టను కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా సేకరిస్తుందని మంత్రి తుమ్మల వివరించారు. అక్కడక్కడా గన్ని బ్యాగుల కొరత, డీజిల్ కొరతతో ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని,  అధికారులు, మా ప్రజా ప్ర తినిధులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ అన్ని పంటల కొనుగోలు చేపడుత న్నట్లు చెప్పారు.