సైబర్, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి
- టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో నేరాలకు చెక్
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పెద్దపీట
- మల్కాజిగిరి సీపీ సుమతి
మేడ్చల్, మే 1(విజయ క్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐ బి) ఐజిగా పనిచేసిన సుమతి మల్కాజిగిరి సిపిగా బదిలీపై వచ్చారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, మహి ళా భద్రత విభాగాల్లో విశేష అనుభవం ఉంది. ఎస్ ఐ బి ఐజిగా పనిచేస్తూ మావోయిస్టులను జీవన స్రవంతిలోకి తీసుకురా వడంలో కీలక పాత్ర పోషించారు.
ఆమె నేతృత్వంలో సుమారు 591 మంది లొంగిపోయారు వాంటెడ్ కూడా లొంగిపో యా రు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్కాజ్గిరి కి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా నియమించడం ఆనందంగా బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.
సాంకేతికతతో నేరాలకు చెక్
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగి స్తామని సీపీ తెలిపారు. ఏఐ ఆధారిత తెలం గాణ క్వస్ట్ వినియోగిస్తమన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని, బాధితులకు సమాచార పూరిత త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
మాదకద్రవ్యాల కట్టడి..ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
సమాజానికి పెను సవాలుగా మారిన ‘మాదకద్రవ్యాల ‘ అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగే షన్ పై దృష్టి పెడతామనీ ఆమె హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా ఏఐ ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నా రు. అలాగే, కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘మహిళా పోలీస్ కమిషనర్గా నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో మా టీమ్ బాధ్యతలను నిర్వర్తిస్తానని ఆమె అన్నారు.






