1 May, 2026 | 2:22 AM

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు

01-05-2026 01:00 AM

కారేపల్లి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దానికి అనుగుణంగానే మండలంలో సొసైటీ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.

మండల పరిధిలోని ఆప్పాయిగూడెం గూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల మార్క్ఫెడ్ గోడౌన్ నందు మొక్కజొన్నల నిల్వ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఇటీవల మండల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే కు రైతులు వద్దనుండి కొనుగోలు చేసే మొక్కజొన్న లారీ లోడ్స్ నిలువ చేసేందుకు ఇబ్బందికరంగా ఉందని విషయాన్ని తెలుసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ కలెక్టర్కు ఫోన్ ద్వారా సమస్యను వివరించడంతో మార్కెట్ గోడౌన్ లో మొక్కజొన్నలు నిలువ చేసుకునేందుకు అనుమతినిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి మండలంలో సుమారు 8000 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట సాగు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2400 రూపాయలకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుంది అన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని మరల వర్షం పడితే రైతుల ఇబ్బందులు పడతారని ఉద్దేశంతో ఖాళీ ప్రదేశాల్లో  అరబోసిన మొక్కజొన్నలను గోడౌన్ లోకి చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని ప్రతి రైతు వద్ద నుండి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.  గోడౌన్ వద్ద రహదారి మార్గం అధ్వానంగా ఉందని త్వరలో ప్రతిపాదనలు పంపి బి టి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు ఆర్ ఐ డి జగదీష్ సర్పంచులు దండు ప్రవీణ్, బానోత్ హిరాలాల్, వీర ప్రతాప్ టోనీ,మహిళా కాంగ్రెస్ నాయకురాలు పగడాల మంజుల మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు కారేపల్లి ఎస్త్స్ర బైరు గోపి సొసైటీ మాజీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు పెదపోయిన ఉమాశంకర్ మాజీ సర్పంచ్ మాలోత్ కిషోర్  మేదరి రాజా తదితరులు పాల్గొన్నారు.