26 May, 2026 | 5:09 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

సమస్యలు పరిష్కరించాలి

30-12-2025 12:00 AM

అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్

జనగామ, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తు లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సమస్య లను వేగవంతం గా పరిష్కరించాలని.. అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్* అన్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇచ్చిన దరఖాస్తు లను అదనపు కలెక్టర్ లు స్వీకరించి వారి సమస్య లను తెలుసుకున్నారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజల సమస్య లను పరిష్క రించడం లో అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. సమస్య లను పరిష్కరించే క్రమం లో దరఖాస్తు దారులకు సమాచారం అందించాలన్నారు.

అనంతరం గురుకులాల,వివిధ సొసైటీల రెసిడెన్షిషియల్ పాఠశాలలో బ్యాక్ లాగ్, కొత్త అడ్మిషన్ లకు సంబందించిన అర్హత పరీక్ష పోస్టర్ ని అదనపు కలెక్టర్ లు ఆవిష్కరించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి 31 దరఖాస్తు లు వచ్చాయి.జనగామ లో నివాసం ఉంటున్న మేకల ప్రశాంత్, తండ్రి: కీ.శే. మేకల శ్రీనివాస్, అనే వ్యక్తి తన భూమి విషయంలో జరిగిన అక్రమ నమోదుపై ఫిర్యాదు చేసి వారి వద్ద ఉన్న ఒరిజినల్ రిజిస్టేషన్ డాక్యుమెంట్లను పరిశీలించి, అక్రమంగా నమోదైన వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించి, వారసుడినైన తన పేరు మీద పట్టా మార్పిడి చేసి కొత్త పాసుపుస్తకం మంజూరు చేయాలని వినతి సమర్పించాడు. ఈ కార్యక్రమం లో ఆర్డీ వో లు, డి ఆర్డీ ఓ, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.