29 May, 2026 | 8:52 PM

రెడ్‌క్రాస్ సభ్యత్వ ధృవపత్రం అందజేత

29-05-2026 03:37 PM

కలెక్టర్‌కు గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం

కుమ్రం భీం ఆసిఫాబాద(విజయ క్రాంతి): రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న జిల్లా కలెక్టర్ కె. హరితకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ధృవపత్రం అందజేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సేవలను గవర్నర్ అభినందించారు. సమాజ సేవలో రెడ్‌క్రాస్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.