3 July, 2026 | 3:50 AM

కాడెత్తిన అన్నదాత ప్రవీణ్

03-07-2026 12:50 AM

మహబూబాబాద్, జులై 2(విజయక్రాం తి): ఎడ్ల జతలో ఒక ఎద్దు మరణించింది. మరో ఎద్దు కొనే ఆర్థిక స్థోమత లేని ఆ గిరిజన రైతుకు కాలం నెత్తి మీదకి రావడంతో.. తానే కాడెద్దుగా మారి కాడెత్తి పొలం దున్నిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్లలో జరిగింది.

గ్రామానికి చెందిన పెనక ప్రవీణ్ అనే రైతుకు చెందిన రెండు ఎడ్లలో ఒకటి నాలుగు రోజుల క్రితం విద్యుదాఘాతానికి గురై మరణించింది. వానాకాలం పంటల సాగు ఎద్దు చనిపోవడంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అప్పటికప్పుడు ఎద్దును కొనాలంటే కనీసం రూ.40 వేలు అవసరం. అంత ఆర్థిక స్థోమత లేకపోవడం.. మరోవైపు పొలం దున్నడానికి అదును దాటుతుండడంతో తప్పని పరిస్థితుల్లో తానే ఎద్దుగా మారి కాడెత్తి పొలం దున్నాడు.