రోడ్డుపై చెత్త వేస్తే రూ.10 వేల ఫైన్ తప్పదు
03-07-2026 12:49 AM
చర్ల, జులై 2 (విజయక్రాంతి): రహదారుల వెంట ఇష్టానుసారం చెత్త పారబోస్తే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తామని చర్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబు హెచ్చరించారు. పాతచర్ల-వెంకటాపురం ప్రధాన రహదారి వెంట వ్యాపారులు మాంసం, కూరగాయల వ్యర్థాలు రోడ్డు పక్కన పడవేస్తుండటంతో భరించలేని దుర్వాసన వస్తోందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంచాయతీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం రాత్రి ప్రత్యేక నిఘా పెట్టిన కార్యదర్శి రాంబాబు, రోడ్డు పక్కన చెత్త వేస్తున్న ఓ వ్యాపారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని స్పాట్లోనే జరిమానా విధించారు.






