6 May, 2026 | 11:36 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

అట్టహాసంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం

06-03-2026 04:01 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజా పాలనా -ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతిరమేష్ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజాపాలనా -ప్రగతి ప్రణాళిక 99 మొదటిరోజు కార్యక్రమను ఉద్దేశించి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి మాట్లాడారు.

10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమము సాగుతుందన్నారు. ప్రణాళిక బద్ధంగా పట్టణాన్ని అభివృద్ధిపరిచే ముఖ్య ఉద్దేశంతోటే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు మానవహారం నిర్వహించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 1,7,25 వార్డుల్లో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య పనులను ప్రారభించారు. ఈ కార్యక్రమములో బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ జె సంపత్, వైస్ చైర్మెన్ రాగంశెట్టి సత్యనారయణ, కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారులు, మెప్మ, సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.