23 July, 2026 | 10:42 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

23-07-2026 09:28 AM

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి( Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు(Bomb threat) మెయిల్ వచ్చింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తుతెలియని దుండగుల నుంచి బెదిరింపు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ నుంచి టేకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉందని ఎయిర్ పోర్టు సిబ్బందికి మెయిల్ వచ్చింది. టేకాఫ్ సమయంలో బాంబు పేలవచ్చంటూ దుండగుడు మెయిల్ పంపాడు. వెంటనే రంగంలోకి దిగిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. అనంతరం బెదిరింపు మెయిల్ బూటకపు మెయిల్ గా తేల్చారు.