23 July, 2026 | 9:50 AM

గుండెపోటుతో పెద్దబోయిన లక్ష్మణరావు కన్నుమూత

23-07-2026 09:03 AM

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంతాపం  

పుల్లయ్యబంజరలో అంతిమ సంస్కారం

కల్లూరు, జూలై 23(విజయ క్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామానికి చెందిన పెద్దబోయిన లక్ష్మణరావు (72) గుండెపోటుతో బుధవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఆయన కల్లూరు సొసైటీ మాజీ అధ్యక్షులు, బిఆర్ఎస్ మండల నాయకులు పెద్దబోయిన మల్లేశ్వరరావు సోదరుడు.

ఆయన మృతి విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.బిఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు,మాజీ,ప్రస్తుత ప్రజా ప్రతినిధులు,స్థానిక ప్రముఖులు పలువురు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.లక్ష్మణరావు అంతిమ సంస్కారం గురువారం మధ్యాహ్నం ఆయన స్వగృహం పుల్లయ్యబంజర గ్రామంలో నిర్వహించనున్నారు.