11 April, 2026 | 10:59 PM

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

11-04-2026 09:10 PM

సర్పంచ్ కలకోట్ల శైలేందర్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): వైద్య శిభిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కలకోట్ల శైలేందర్ అన్నారు. శనివారం మండలంలోని అడివెంల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ అర్వపల్లి ఆధ్వర్యంలో అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యాధి నిర్ధారణ అయిన వారు వైద్యుల సూచనల మేరకు మందులు వాడి జబ్బును తగ్గించుకోవాలని సూచించారు.అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్, సీహెచ్ఓ బిచ్చునాయక్, హెల్త్ సూపర్వైజర్ లలిత, ఉపసర్పంచ్ వజ్జె చిన్నరవి,వార్డు సభ్యులు మాదగాని అజయ్,వజ్జె పెద్దరవి, బొర్ర నాగరాజు, వైద్య సిబ్బంది గౌతమి, దుర్గమ్మ, సైదమ్మ, ఆశాలు స్రవంతి, పుష్పలత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.