25 April, 2026 | 6:44 PM

కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి

25-04-2026 05:11 PM

ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని ప్రారంభించాలని కెఎన్ ఆర్ సేవాదళం విజ్ఞప్తి చేసింది. "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పాలనను ప్రజల చెంతకే తీసుకురావచ్చని సేవాదళం నాయకుడు బాబా ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని కోరారు.

ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు సాయంత్రం 3:30 నుండి రాత్రి 7:30 వరకు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా, డివిజనల్ కార్యాలయాల చుట్టూ తిరిగే వ్యయప్రయాసలను తగ్గించవచ్చాన్నారు. మండల కేంద్రాల్లోనే జిల్లా, డివిజనల్ అధికారుల సమక్షంలో ఫిర్యాదులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిష్కరించడం వల్ల రాజకీయాలకు అతీతంగా, అధికార-ప్రతిపక్ష భేదం లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను వినడం. 

"నాయకుడంటే కేవలం మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చూపేవాడే నిజమైన ప్రజానేత అనిఎమ్మెల్యే కసిరెడ్డి  సంకల్పానికి ఈ 'ప్రజా దర్బార్' ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని కే ఎన్ ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు బాబా కోరారు. ​ఈ వినూత్న నిర్ణయం ద్వారా నియోజకవర్గ ప్రజల కలలు సాకారమవుతాయని, ఎమ్మెల్యే  ప్రజాసేవకు ఇది మకుటాయమానంగా మారుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.