calender_icon.png 23 February, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల

23-02-2026 12:13:17 AM

ఇస్తారాజ్యంగా పనులు 

మరిపెడ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తే, పనులు నాణ్యతతో చేయాల్సిన గుత్తేదారు ఇష్టరాజ్యంగా చేయడం వల్ల రోడ్డు వేసిన కొద్ది రోజులకే తారు లేచిపోయి అద్వానంగా మారిన ఘటన మరిపెడ మండలంలో వెలుగు చూసింది.

మరిపెడ మండలం తాళ్ళ ఉకల్ గ్రామం నుంచి వెంకంపాడు గ్రామం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ఐటీడీఏ ద్వారా ఇటీవల బీటీ రోడ్డు వేశారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కంకరపై కేవలం డాంబర్ వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు గుండా వెంకంపాడు,బాఓజీ గూడెం, ఆనేపురం, నిలుకుర్తి , గ్రామస్తులకు నేరుగా సూర్యాపేట చేరుకోవడానికి రెండు సౌకర్యం కలిగిందని సంతోషించే లోపే తారు రోడ్డు వేసిన వెంటనే మరుసటి రోజు ఇలా పగుళ్లు గుంతలు ఏర్పడడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వెంకంపాడు గ్రామపంచాయతీ నుండి తాళ్ల ఊకల్ వరకు ఐటీడీఏ ద్వారా ఒక కోటి 50 లక్షల వ్యయంతో శాంక్షన్ అయిన రోడ్డును కనీస ప్రమాణాలు పాటించకుండా ఇలా వేయడం పై చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు నిర్వహించి, నాసిరకంగా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ లైసెన్స్ ను రద్దు చేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు. తాళ్ల ఊకల్ నుంచి వెంకంపాడు గ్రామపంచాయతీ వరకు బీటీ రోడ్డు కనీస ప్రమాణాలు, నాణ్యత పాటించకుండా వేస్తే నాణ్యతను పరిశీలించి, మరల రోడ్డును పునరుద్దించి కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ఏఈ మాలోతు రవి.  అన్నారు.