calender_icon.png 11 February, 2026 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరిలో ప్రశాంతంగా 88.36% పోలింగ్

11-02-2026 06:49:48 PM

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కమల దంపతులు లో ఓటు వేసిన దృశ్యం

పోలింగ్ కేంద్రాల్లో ఓటు స్థలం పరిశీలించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 15 వార్డులలో బుధవారం 7 గంటలకు ఓటింగ్ జరగా, మొదట కొద్దిగా మందకుడిగా సాగినప్పటికీ, గంట, గంటకు వార్డులలో ఓటింగ్ శాతం పెరిగింది. మున్సిపల్7 వార్డులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కమలదంపతులు ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం కాగా, తిరుమలగిరి 14వ వార్డులో ఒక్క ఓటు కోసం, విమానంలో హైదరాబాదుకు వచ్చి, ఉత్తరప్రదేశ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి ఓటు వేయడం గమనార్వం. దీనితోపాటు వేల్పుల సోమక్క కాలు విరగగా, కుటుంబ సభ్యులు, సిబ్బంది వీల్ చైర్ లో తీసుకుని వెళ్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయించారు.

సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీలో మొత్తం 15,455ఓట్ల గాను,13,856 ఓట్లు పోలైనట్లు, దీనితో 85.36% ఓటర్ల పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ నోడల్ అధికారి తాసిల్దార్ హరిప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందనల్ పవర్, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు .ఉదయం ఎన్నికల సరళిని రాష్ట్ర ఎన్నికల  అబ్జర్వర్ పాండుదాస్ రికార్డులను, పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ నరసింహ, పోలీస్ అధికారుల చే పూర్తి బందోబస్తు నిర్వహించారు.