18 March, 2026 | 1:21 PM

చికెన్ మార్కెట్‌పై పోలీసుల దాడి

18-03-2026 12:00 AM

సికింద్రాబాద్, మార్చి17 (విజయక్రాంతి): సికింద్రాబాద్ జోన్ పరిధిలోని వారాసిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ  ఆహార కల్తీ ఘటన వెలుగులోకి వచ్చింది. బాపూజీనగర్, ముషీరాబాద్ ప్రాంతంలోని ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్లో అనారోగ్యకరమైన, పాడైపోయిన చికెన్ను విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు.

మంగళవారం  మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు సదరు మార్కెట్ షాపులో డీకాయ్ సిబ్బంది ముందుగా దుకాణాన్ని తని ఖీ చేయగా, అక్కడ నిల్వ ఉంచిన చికెన్ పాడైపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు.అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ కె. రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బృందం దుకాణంపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సం దర్భంగా సుమారు 610 కిలోల చికెన్ను అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచినట్టు గుర్తించారు.

ఎలుకలు, పిల్లులు సంచరిస్తున్న పరిస్థితుల్లో ఆహారం కలుషితమవుతున్నప్పటికీ, ప్రజలకు విక్రయిస్తున్నట్టు బయటపడింది. దుకాణ యజమాని షేక్ షకీల్ (40) నిర్లక్ష్యంగా వ్యవహరి స్తూ, మానవ వినియోగానికి అనర్హమైన మాంసాన్ని విక్రయిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా, ఆ దుకాణానికి సంబంధించిన ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే గడువు ముగిసినా,అదే కొనసాగిస్తున్నట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.