ఇంట్లోకి నాగుపాము.. కుటుంబ సభ్యుల్లో కలకలం
మంథని, ఆగస్టు 14(విజయక్రాంతి): మంథని పట్టణంలోని వాగు గడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి ఓ ఇంట్లోకి నాగుపాము చొరబడటంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంట్లోకి నాగుపాము రావడంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నాగుపామును సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం పామును జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పామును చూసిన వెంటనే భయంతో దానిని చంపేందుకు ప్రయత్నించకుండా, నిపుణులకు సమాచారం అందించాలని స్థానికులు సూచించారు. పాములు పట్టే వ్యక్తి కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు.






