05-02-2026 12:14:37 AM
యువతలో ఆన్లైన్ బెట్టింగ్ పై అవగాహన కల్పించాలి
ద్విచక్ర వాహనాలు నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, బోధన్ ఎ.సి.పి కార్యాలయాని పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రస్తుతం ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తూ ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు.ప్రతీ పోలింగ్ స్టేషన్ను సిబ్బంది కనీస వసతులు కల్పించే విధంగా చూడాలన్నారు.ఎ.సి.పి కార్యాలయంలోని రికార్డులు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులపై వివులంగా తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాన్యమైన ధర్యాప్తు చేయాలని సూచించారు.
సబ్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్ లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ ధరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకము తీసుకోవాలని. సంబంధిత రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని సూచించారు. సబ్ డివిజన్లోని అన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహణ పాఠశాలలు మరియు కళాశాలలలో సోషల్ మీడియా ద్వారా అవగాహణ నిర్వహించాలి. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చేవిధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపర్చుకోవాలని తెలిపారు.
ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం నిర్వహించాలని, రోడ్ ప్రమాదాల నివారణకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాల ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సబ్ డివిజన్లోని అన్నీ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ యందు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని, హెల్మేటు తప్పనిసరిగ్గా ధరించాలని సూచించారు. బోధన్ ఎ.సి.పి. పి. శ్రీనివాస్, బోధన్ ఎస్.హెచ్.ఓ వెంకట్ నారాయణ, బోధన్ రూరల్ సి.ఐ డి. విజయ్ బాబు, రుద్రూర్ సి.ఐ ఆర్. కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.