3 September, 2026 | 9:18 PM

36 గంటల్లో దోపిడీ కేసును ఛేదించిన నాగిరెడ్డిపేట పోలీసులు

03-09-2026 | 07:00pm

ముగ్గురు నిందితుల అరెస్ట్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): 36 గంటల్లో దోపిడీ కేసును(Robbery case) చేదించిన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల(Nagireddypet Mandal) పోలీసులు. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆగస్టు 31తేదీన మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు, గోపాల్‌పేట్‌లోని దత్తు హాస్పిటల్ ముందు పోచమ్మరాల్ గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి, బెదిరించి వారి వద్ద ఉన్న సుమారు 12 తులాల వెండి గొలుసు, రూ.15,000/- నగదును తీసుకొని జూపిటర్ స్కూటీపై మెదక్ వైపు పారిపోయారు.

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే నాగిరెడ్డిపేట మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించారు. పోలీసుల సమన్వయంతో నిందితుల కదలికలు, వారి వివరాలను 36 గంటల్లోనే గుర్తించడం జరిగింది. తదుపరి సెప్టెంబర్ 02 తేదీన నిందితులు తిరిగి నాగిరెడ్డిపేట మండలం వైపు వస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో, పోలీసులు అప్రమత్తమై పోచారం చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.

నిందితుల వారి వద్ద నుండి సుమారు 12 తులాల వెండి గొలుసు,₹15,000/- నగదు,నంబర్ ప్లేట్ లేని ఒక జూపిటర్ స్కూటీ, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి,దర్యాప్తులో భాగంగా అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం సెప్టెంబర్ 02 తేదీన రాత్రి  మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగింది. ఈ కేసును కేవలం 36 గంటల్లోనే ఛేదించడంలో సీసీటీవీ కెమెరాల విశ్లేషణ, హ్యూమన్ ఇంటెలిజెన్స్, పోలీసుల సమన్వయం కీలకంగా పనిచేశాయి. నాగిరెడ్డిపేట పోలీసులు ప్రజల భద్రతకు నిరంతరం కట్టుబడి ఉంటారు.ఏ,,వన్గా ధర్మశంకర్ చోహన్,ఎ, టుగా రమేష్ చంద్ర సింగ్ చౌహన్, ఏ, త్రీగా శివాజీ చౌహన్ నిర్ధారించి ఎల్లారెడ్డి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరిగిందని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు.