23 March, 2026 | 4:47 PM

కవితాసంపుటి ఆవిష్కరణ

23-03-2026 12:00 AM

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమి, సమ్మక్క- సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో డాక్టర్ కొరుప్రోలు హరనాథ్ ‘నా అడుగులటువైపే’ కవితాసంపుటి ఆవిష్కరణ సభ జరుగనుంది. పుస్తకాన్ని సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ఆవిష్కరించనున్నారు.

కవి కొరుప్రోలు హరనాథ్ ఈ పుస్తకాన్ని సమ్మక్క- సారక్క డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కుమారి సబితారెడ్డికి అంకితం ఇవ్వనున్నారు. సభకు డాక్టర్ కాంచనపల్లి అధ్యక్షత వహించనున్నారు. అతిథులుగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి నామోజు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు డాక్టర్ అనితారెడ్డి, గుడిపాటి, డాక్టర్ అమృతలత, వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని, పల్లె కిశోర్ కుమార్, కటికోఝ్వల ఆనందాచారి హాజరుకానున్నారు.