15 May, 2026 | 8:37 PM

బండి భగీరథపై పోక్సో కేసు నమోదు చేసి తక్షణ అరెస్ట్ చేయాలి: పొట్ట ప్రభు

15-05-2026 07:43 PM

దేవరకొండ,(విజయక్రాంతి): బండి భగీరథపై పోక్సో కేసు నమోదు చేసి తక్షణ అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షుడు పొట్ట ప్రభు డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండలో ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బండి భగీరథపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

నిందితుడు ఎవరి కుమారుడైనా సరే చట్టం ముందు అందరూ సమానమని, బాధిత బాలికకు న్యాయం జరగాలంటే వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.రాజకీయ ప్రభావంతో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగితే యంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.