18 July, 2026 | 2:06 AM

సంక్షోభాలను తిప్పికొట్టాం

18-07-2026 01:55 AM

ఆవిరి యంత్రం నుంచి హైడ్రోజన్ దాకా చేరుకున్నాం

కామన్‌వెల్త్, ఒలింపిక్ క్రీడలను దేశంలోనే నిర్వహిస్తాం

దేశ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడం ప్రభుత్వ బాధ్యత

దేశంలోనే తొలిసారి చండీగఢ్‌లో హైడ్రోజన్ రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

చండీగఢ్, జూలై 17: పశ్చిమాసియా లాంటి ఉద్రిక్తతలు 2014కు ముందు తలెత్తి ఉంటే దేశ రైల్వే వ్యవస్థ కుప్పకూలి ఉండేదని, తమ ప్రభుత్వం అనేక సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ప్రధాన విజయమన్నారు. చండీగఢ్ కేవలం ఒక నగరం మాత్రమే కాదని, భారతదేశ అభివృద్ధికి ఆద ర్శ ప్రాంతంగా నిలుస్తోందని కొనియాడారు.

ఇక్కడి మెరుగైన జీవనశైలి ప్రపంచదేశాల్లోనూ ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతానికి చండీమాత ఆశీస్సులు ఉన్నాయని అందువల్లే ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని వివరించారు. దేశం వికసిత్ భారత్ దిశగా సాగిస్తున్న ప్రయాణంలో భవిష్యత్ సాంకేతికతలు, ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణపై ఆధారపడాలని ప్రధాని నొక్కి చెప్పారు. వర్తమాన, భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు మనం తీసుకోవాలని, బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వివరించారు. 

దేశంలో తొలిసారి సున్నా ఉద్గారాల రైలు..

శుక్రవారం హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే తొలిసారిగా కర్బన ఉద్గారాలు విడుదల చేయని హైడ్రోజన్‌తో నడిచే రైలుతోపాటు, ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలతో స హా రూ.4,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈ ప్రాంత అభివృద్ధితో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రజలకు కూడా మేలు చేకూరుతుంది. చండీగఢ్ ఒక ప్రధాన కేంద్రంగా అవతరించడం గర్వకారణం. 19వ శతాబ్దంలో ఆవిరియంత్రంతో నడిచే రైళ్లు కాలక్రమేణా అనేక మా ర్పు చేర్పులకు లోనయ్యాయి. 20వ శతాబ్దంలో డీజిల్, విద్యుత్ శక్తి ఇంధనం ఉండ గా, 21వ శతాబ్దంలో హైడ్రోజన్ శక్తితో రైళ్లు నడిచే రోజు రానే వచ్చింది. అంతర్జాతీయ ముడిచమురు సంక్షోభ సమయంలో దేశంలో హైడ్రోజన్ రైలు ప్రారంభించుకోవడం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.

2036లో ఒలింపిక్ క్రీడలను భారత్‌లోనే నిర్వహించనున్నాము. 2030లో కామన్‌వెల్త్‌కు ఆతి థ్యం ఇస్తాం. క్రీడాకారులకు అన్ని రకాల మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాం. నూతన ఎంబీబీఎస్ కళాశాలకు ఆమోదం లభించిందని, త్వరలో తరగతులు ప్రారంభం అవుతా యి. ఇప్పుడు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత, ప్రజల హక్కు . గత 12 ఏళ్లలో దేశంలో అనేక ఏయిమ్స్ ఆసుపత్రులను ని ర్మించాం.

వైద్య రంగంలో అనేక నూతన సం స్కరణలను ప్రవేశపెట్టాం. భారతదేశ నేర న్యాయ వ్యవస్థ సంస్కరణ దిశగా వలసవాద కాలం నాటి శిక్షాస్మృతి స్థానంలో కేంద్ర భా రతీయ న్యాయ సంహింతను తీసుకువచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  పం జాబ్ జలంధర్ పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ అమృత్ భారత్ పథకంలో భాగంగా 20 రాష్ట్రాల్లోని ఆధునీకరించిన 75 రైల్వేస్టేషన్లను వర్చువల్‌గా ప్రా రంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైటెక్ సి టీ, రాయనపాడు, మంగళగిరి రైల్వేస్టేషన్లున్నాయి. 

హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు..

జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించిన హైడ్రోజన్ రైలు 89 కిలోమీటర్ల జింద్ మార్గంలో నడుస్తుంది. జింద్ జంక్ష న్, గోహానా జంక్షన్  సోనిపత్‌లను కలుపుతూ, మధ్యంతర స్టేషన్లలో కూడా సేవలు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న అతికొద్ది హైడ్రోజన్ రైళ్లలో ఇది ఒకటి. ఈ రైలు రవాణా కోసం హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే దేశాల సరసన భారత్ చేరినట్లయ్యింది.

హైడ్రోజన్ ఫ్యూయ ల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే లోకోమోటివ్ ట్రైన్. ప్రధాని ప్రారంభించిన ఈ తొలిరైలులో 10 బోగీలుండగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా 1200 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసుకుంటూ గంటకు 75 కి.మీ. వేగంతో వెళుతుంది. దీని గరిష్ట వేగం 110 కి.మీ. అయినప్పటికీ ప్రస్తుతం ఈ మా ర్గంలో 75 కి.మీ. పరిమితం చేశారు. 2600 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3వేల కిలోల హైడ్రోజన్ నిల్వ సామ ర్థ్యం ఉంది.

24 గంటలు సాంకేతిక సిబ్బంది రైలులో ఉంటారు. అత్యధిక భద్రతా ప్రమాణాలను పాటించారు. ఈ హైడ్రోజన్ రైలు ను అంతర్జాతీయంగా ఆమోదించబడిన క ర్బన ఉద్గారాలను తగ్గించే ప్రమాణాలకు అ నుగుణంగా, రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో భారత్‌లోనే రూపొందించడం గమనార్హం. ఈ రైలు నిర్మాణానికి రూ. 112 కోట్లు ఖర్చయింది. భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా విద్యుదీకరించని మార్గాల్లో 35 రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.