23 June, 2026 | 11:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నా తండ్రి బతికున్నట్లు ఆధారాలివ్వండి

29-11-2025 12:32 AM

ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసీం డిమాండ్

ఇస్లామాబాద్, నవంబర్ 28: ‘నా తండ్రి, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బతికున్నట్లు ఆధారాలు చూపించాలి’ అని ఆయన కుమారుడు కాసీం ఖాన్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్ చనిపోయినట్లు వస్తోన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ‘డెత్ సెల్’ గురిం చి కాసీం ఆరోపిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తను సజీవంగా ఉన్నట్లు రుజువు కావాలని డిమాండ్ చేశాడు.

తన తండ్రికి ఏదైనా హానీ జరిగితే తీవ్ర పరరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించాడు. ఈ మేరకు తన తండ్రి గురించి పట్టించుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘా లు, ప్రజాస్వామ్య దేశాలను కోరుతూ ఆయన ‘ఎక్స్’లో శుక్రవారం పోస్ట్ చేశాడు. ‘నా తండ్రిని ఆగస్టు 2023 నుంచి రాజకీయంగా, అవినీతి ఆరోపణలపై జైలులో ఉచారని, అతపై అడియాలా జైలులోని ‘డెత్ సెల్‘లో ఆరు వారాల పాటు మొత్తం ఏకాంత నిర్బంధాన్ని విధించారని ఆరోపించారు.