1 August, 2026 | 1:23 AM

కింది బస్తీ నుంచి మట్టి రోడ్డు వేయించండి

01-08-2026 12:28 AM

మేడ్చల్ అర్బన్ జూలై 31(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలోని కిందిబస్తి లో ఉన్నటువంటి శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయం వరకు మట్టి రోడ్డు వేయించండని మేడ్చల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు మేడ్చల్ ముదిరాజ్ సంగమం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముందిరాజ్ సం ఘం అధ్యక్షుడు కే ఆంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు 6 వ తేదీన కిందిబస్తి లో ఉన్నటువంటి శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయం బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ చాపల మార్కెట్ నుండి ఆల యం వరకు ద్విచక్ర వాహనదారులు వెళ్ళే అవకాశం లేదని ఆయన డిసికి తెలియజేశారు.

గతంలో చాపల మార్కెట్ నుండి నల్లపోచమ్మ తల్లి ఆలయం వరకు మున్సిపల్ సిబ్బంది అండర్ డ్రైనేజీ కాలువ కోసం పెద్ద పైప్ లైన్ వేయడం మూలంగా రోడ్డుపై ఎత్తు పల్లాలు ఏర్పడి వాహనదారులు డ్రై వింగ్ చేస్తూ కింద పడి పోతున్నారని ఆయన స్పష్టం చేశారు.

వైద్యంలో ప్రస్థానానికి శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా చాపల మార్కెట్ నుండి శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయం వరకు మట్టి రోడ్డు వేయించాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు బర్ల సంతోష్ ముదిరాజ్.దుబ్బ రామస్వామి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.