2 March, 2026 | 12:14 AM

అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

01-03-2026 06:02 PM

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు. ఆదివారం మున్సిపల్  పరిధిలోని 4వ వార్డ్, 15వ వార్డ్ లో బొమ్మ వెంకటలక్ష్మి, తాటిపాముల తిరుమల,  ఎలగందుల విజయ ల  ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ... ఎమ్మెల్యేతో పాటు పాలకవర్గం, అధికారులు, ప్రజల  అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట 15 వ వార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల, రవీందర్,  చిలగాని రాజు, సంతోష్, నవీన్, రాజేందర్, మంతేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.