ఆధ్యాత్మికత, వ్యవసాయానికి నెలవు ‘పెద్దదిన్నె’
పైలెట్ ప్రాజెక్టుగా పెద్దదిన్నె గ్రామం ఎంపిక
ఇటిక్యాల, జూన్ 15: మండలంలోని పెద్దదిన్నె గ్రామం తనదైన విశిష్టతతో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల వల్ల ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని స్థానికులు గర్వంగా చెబుతున్నారు. ఇక్కడ ఏటా నిర్వహించే స్వామివార్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయని, ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివ స్తారని పేర్కొన్నారు.
వ్యవసాయానికి అనుకూలం.. భూసారమే బలం!
కృష్ణా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాల ప్రభావం వల్ల ఈ గ్రామ భూము లు అత్యంత సారవంతంగా మారాయి. ఇక్కడి నల్లరేగడి, ఎర్ర నేలలు అన్ని రకాల పంటల సాగుకు ఎంతో అనుకూలమైనవని స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక..
ప్రభుత్వ ప్రతిష్టాత్మక ’భూ భారతి’ ప్రాజెక్టు కింద పెద్దదిన్నె గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయని స్థాని కులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






