12-02-2026 03:06:09 AM
ఒకే వేదిక మీద మూడు మత గురువుల ప్రసంగం
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఇస్లామిక్ పండితులు, హిందూ పూజారులు, హిందూ పండితులు, క్రైస్తవ బోధకులు, సిక్కు గురువులు ఒకే వేదిక పైనుంచి ప్రజలకు శాంతి సందేశం ఇచ్చారు. మా హాఫీజ్ అండ్ ఖారీ ముహమ్మద్ అలీ ఖాద్రీ (ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇమామ్స్ అండ్ మసాజిద్ అధ్యక్షుడు) మానవత్వాన్ని నొక్కి చెపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇస్లాంలో, ఒకే వ్యక్తిని అన్యాయంగా చంపడం అనేది వారి మతం తో సంబంధం లేకుండా మొత్తం మానవాళిని చంపినట్లుగా పరిగణించబడుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం అర్థంకాని విషయమని పేర్కొన్నారు. దేశం లో మతపరమైన ద్వేషం ఏ నైతిక సమాజంలోనూ ఆమోదయోగ్యంకాని జాచ్కు వ్యతి రేకంగా ప్రజలను ఇరికిస్తున్నారని, ఈ చట్టా న్ని రూపొందించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర కౌన్సిల్ జాతీయ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరిం ది.
దేశవ్యాప్తంగా శాంతి, ప్రేమను పెంపొందించే ఏ ప్రయత్నానికైనా మద్దతివ్వడానికి ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా, భారతదేశంలోని ముస్లిం లు ముస్లింలకు మాత్రమే కాకుండా, ‘అన్ని ప్రపంచాలకు దయ‘ (రహమతుల్-లిల్-అలమీన్) నాయకుడు అయిన ప్రవక్త ముహమ్మద్ (స) సమాజానికి చెందినవారమని ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుంటున్నారు.