మా బకాయిలు చెల్లించండి
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు శంషాబాద్ జోన్ కాంట్రాక్టర్ల సంఘం విన్నపం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో, తమ పెండింగ్ బిల్లులు బడ్జెట్ సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ శంషాబాద్ జోన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జీహె చ్‌ఎంసీ ఉన్నతాధికారులను కోరింది. బడంగ్‌పేట్ సర్కిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం సంఘం అధ్యక్షుడు పన్నాల రాజేందర్ రెడ్డి నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
పలు పనులకు సంబంధించి శంషాబాద్ జోన్ అకౌంట్స్ సెక్షన్లో భారీ గా నిధులు నిలిచిపోయాయని జనరల్ సెక్రటరీ ఎరుగడిండ్ల శం కర్ తెలిపారు. అసోసియేషన్ ట్రెజరర్ మాదారి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వడత్యా బాలాజీ, వేముల తిరుపతయ్య, జాయింట్ సెక్రటరీలు ముత్యాల అంబాదాస్, పి. సైదా నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బొమ్మగాని వెంకన్న గౌడ్, డేరంగుల మహేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు.




