28 August, 2026 | 5:15 PM

సర్పంచ్ పగడాల రమాదేవి ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

28-08-2026 03:49 PM

అన్నలకు రాఖీ కట్టిన సర్పంచ్ రమాదేవి 

దమ్మపేట, ఆగస్టు 28(విజయక్రాంతి): రాఖీ పండుగ సందర్భంగా దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఇంట్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి తన అన్నలకు రాఖీలు కట్టి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. వేడుకల్లో భాగంగా, రమాదేవి సాంప్రదాయబద్ధంగా నుదుటిపై తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీలు కట్టారు. ఆ తరువాత ఆమెకు కానుకలు సమర్పించి అన్నలు తమ ప్రేమను చాటుకున్నారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ, "రాఖీ పండుగ అన్నదమ్ముల మధ్య ఉన్న అనురాగానికి, సోదరభావానికి ప్రతీకనీ, ఈ రాఖీ పండుగ నా అన్నదమ్ములకు రాఖీలు కట్టడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, మా మధ్య ఉన్న ఈ బంధం ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.