1 July, 2026 | 10:00 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఫాం హౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ

18-02-2026 12:00 AM

డ్రగ్ పాజిటివ్ కేసు నమోదు

మొయినాబాద్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): మొయినాబాద్ పోలీసుల రాత్రి పర్యవేక్షణలో భాగంగా తెల్లవారుజామున సుమారు 2.00 గంటల సమయంలో చిన్నమంగలరామ్ గ్రామ పరిధిలోని సుకస ఫాం హౌస్‌పై దాడి నిర్వహించారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా, పార్టీలో పాల్గొన్న వారి లో ఒకరికి డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దీనిపై పోలీసు లు వెంటనే చర్యలు తీసుకుని పార్టీ నిర్వాహకుడు, ఫాం హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, మద్యం సేవించడం, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొ న్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యా ప్తు చేపట్టినట్లు వెల్లడించారు. పోలీసులు హెచ్చరిస్తూ, ఫార్మ్ హౌస్‌లో అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.