24 August, 2026 | 5:00 PM

నూతన మండలంలో వాహనాలపార్కింగ్‎కు ఇబ్బందులు

24-08-2026 04:04 PM

బోథ్. ఆగస్ట్ 24 ( విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సోనాల మండల కేంద్రంలో అంతర్ రాష్ట్ర రహదారిపై తరసుగా పార్కింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రం మీదుగా అంతర్జా రహదారి ఉండడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల వారు పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్ల పక్కనే వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రమాదాలు జరుగు తాయేమోనని ఆందోళన రక్త పరుస్తున్నారు. కొంతమంది వ్యాపారులు తమ వ్యాపారాలను రోడ్డు ఎక్కిస్తుంటే ద్విచక్ర వాహనాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాపార సంస్థల వారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. పంచాయతీ పాలకవర్గం వారు సైతం తమ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.