ఆటో కార్మికుల ధర్నా విజయవంతం
కరీంనగర్ క్రైమ్ ఆగష్టు 24 (విజయ క్రాంతి): ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోలు బందులో పాల్గొన్నారు. అదేవిధంగా కరీంనగర్ టౌన్ పరిధిలో 4500 ఆటోలు టౌను మరియు చుట్టుపక్క మండలాల నుంచి వచ్చే 3000 ఆటోలు మొత్తం కలిపి 7500 ఆటోలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు సఫలమని రాత్రి పూట ఆటో సంఘాల బందును విచ్చిన్నం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఒకవేళ చర్చలు జరిపినట్లైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి మా ఆటో నాయకులతోని కలిసి ఎందుకు చెప్పడం లేదు.. ఒకవేళ నిజంగానే మా సమస్యలను పరిష్కరించాలని మీకు ఉంటే కార్మిక శాఖ మంత్రి ద్వారా గాని లేకపోతే రవాణా శాఖ మంత్రివర్యులు అయిన మాట్లాడానికి మీకు టైం దొరకడం లేదా అంటూ ప్రశ్నించారు.
మాకు 12 వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రమాద భీమను వెంటనే అమలు పరచాలని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రాపిడో వోలాలో నడుస్తున్న టూవీలర్ బైక్లను వెంటనే రద్దు చేయాలని ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని ఉచిత బస్సు పైన ఉన్న ఆలోచన చేయాలని మా ఆటో డ్రైవర్ల పైన ప్రేమ ఉంటే వెంటనే మా డిమాండ్లను నిర్దిష్ట పరిధిలో టైం లోపల నెరవేరుస్తామని పత్రికా ముఖంగా చెప్పాలని జీవో రూపకంగా గానీ వెంటనే మా ఆటో డ్రైవర్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలని డిమాండ్ చేశారు విభజించు పాలించు అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇవ్వల్ల ఆటో డ్రైవర్ల బందును ఇచ్చింది ఏం చేయడానికి మాత్రమే చర్చలు సఫలమని మమ్ముల మోసం చేసిందని భావించడం జరుగుతుందని నిజంగానే మా డిమాండ్లను కనుక ఒప్పుకున్నట్లయితే వెంటనే పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి అంతగిరి సంపత్ ఉపాధ్యక్షులు కొత్తూరి సత్యనారాయణ ఇరవేణి కుమార్ కొత్తూరు రఘు దండు అంజయ్య కుకట్ల సంపత్ కోశాధికారి చిట్టి మల్ల నాగభూషణం సహాయ కార్యదర్శులు వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు






