22 July, 2026 | 11:30 AM

వీపనగండ్ల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పలుస రామన్ గౌడ్

22-07-2026 10:15 AM

వీపనగండ్ల: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్పంచుల సంఘం సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పలుస రామన్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా దొడ్ల కవిత, కోశాధికారిగా గోపీనాయక్, ప్రచార కార్యదర్శిగా రాముడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలుస రామన్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి సర్పంచులతో సమన్వయంగా పనిచేస్తూ నిధుల సాధన, సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్సై జె. నరేష్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.