ఘనంగా పద్మశాలి ప్రతిభా పురస్కారాల ప్రదానం
29-08-2026 02:25 AM
మహబూబ్‌నగర్ అర్బన్ ఆగస్టు 28: నగరంలోని పద్మావతి కాలనీలోని శివమార్కండేయ దేవాలయంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపోపా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్, ఎప్సెట్, నీట్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని టీపోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సూచించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






