15 June, 2026 | 3:33 PM

Breaking News

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి   •   ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సే: రామచందర్‌రావు   •   ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ   •   కిరాతకుడుని ఉరితీయాలి..   •   కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •  

సిద్దాపూర్ సర్పంచ్ గా పద్మ ప్రమాణ స్వీకారం

22-12-2025 12:57 PM

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ చెండే పద్మ, ఉప సర్పంచ్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. స్పెషల్ ఆఫీసర్ సోయల్ సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు సర్పంచ్ ను ఉప సర్పంచ్ ను పూలమాలలు వేసి సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మా మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గ్రామపంచాయతీని ఆదర్శంగా గ్రామపంచాయతీ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తుకారం, నాయకులు చెండే శంకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.