శ్రీ గోకులం యాదవ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవo
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీ గోకులం యాదవ సంఘం సోమవారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యాదవ సమాజ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఐక్యమత్యంతో ఈ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మూడెత్తుల మల్లేష్ యాదవ్ తెలిపారు. నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్,రాసాల వెంకటేష్ యాదవ్, వ్యవస్థాపక అధ్యక్షుడు మూడెత్తుల మల్లేష్ యాదవ్.ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ... యాదవ సోదరులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సంఘ బలోపేతానికి,సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు.తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలకు,సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






