10 August, 2026 | 10:26 PM

45 రోజుల అంకితభావానికి అభినందనలు

10-08-2026 09:33 PM

ఎస్‌ఐఆర్‌ విధుల్లో సేవలందించిన సిబ్బందికి మాజీ కార్పొరేటర్ పనుగంటి బాబు కృతజ్ఞతలు

జవహర్‌నగర్,(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగంగా గత 45 రోజులుగా నిరంతరంగా విధులు నిర్వహించిన సిబ్బందిని మాజీ కార్పొరేటర్ పనుగంటి బాబు అభినందించారు. ఎండ, వర్షాలను లెక్కచేయకుండా ప్రజల వద్దకు వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ, పరిశీలన తదితర ప్రక్రియల్లో సిబ్బంది చూపిన అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని పనుగంటి బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.