10 August, 2026 | 10:27 PM

పలారం బండి ఊరేగింపులో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

10-08-2026 09:26 PM

పిర్జాదిగూడలో ఘనంగా బోనాల ఉత్సవాలు

పిర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పిర్జాదిగూడ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేసిన నిర్వాహకులను, భక్తులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, వీరాంజనేయ స్వామి దేవాలయ డైరెక్టర్ వంగూరి పరమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, కుర్ర శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.