4 April, 2026 | 5:30 PM

తాండూర్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

04-04-2026 03:56 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ సొసైటీ సహకార సంఘం పరిధిలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సొసైటీ అధికారులు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధికారులు, మాజీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి వరి ధాన్యం తూకం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులెవరు ఆందోళన చెందవద్దని ఎండలు ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. బయట దళారులకు ధాన్యాన్ని అమ్ముకొని మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కాంట చేసిన 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.