4 April, 2026 | 6:17 PM

మంథనిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్

04-04-2026 04:51 PM

ఎంసీపీఎఫ్ అధ్యక్షుడు ఐతు డేవిడ్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ను మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులతో కలసి జెండా ఊపి ప్రారంబించారు. ఈ కార్యక్రమం ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీగా బయలుదేరి ఏసుక్రీస్తు ప్రేమ సహనం త్యాగం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చాటి చెబుతూ ప్రతి ఒకరు ఒకరు ప్రేమ సహనం తో ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమం పాలు పొంది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఎం సి పి ఎఫ్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఎరుకలగూడెంలోని బెతేల్ గోస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సన్ రైజు హాస్పిటల్ యజమాన్యం సహకారంతో మెగా ఉచిత వైద్య  శిబిరమును ఎస్సిసిఎల్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంను పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు ఆర్థిఏ మెంబెర్ సురేష్,  విద్యుత్ మండలి సలహాదారులు కాచే శశిభూషన్, మాజీ ఏఎంసీ  అజీమ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కౌన్సిలర్లు  వంశీ  మాట్లాడుతూ... మన భారతదేశంలో శాంతి సమాధానాలు ఉన్నాయని గుడ్ ఫ్రైడే సందర్భంగా వారు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహకరిస్తామని తెలిపారు. మెగా ఉచిత వైద్య శిబిరం లో మందులు ఉచితంగా పంపిణి చేసి సహకరించిన సన్ రైజు హాస్పిటల్ యజమాన్యం కు క్రైస్తవ సోదరులు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.