7 April, 2026 | 3:07 PM

Breaking News

వలసదారులకు కేంద్రం ఊరట: 5 కిలోల సిలిండర్ల కేటాయింపు రెట్టింపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •   విద్యార్థులు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలి   •   సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిరుత పులి దాడి   •   బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్   •   ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని   •  

మన మాతృభాష కంటి చూపులాంటిది

07-04-2026 12:50 AM
  1. ఇంగ్లిష్ భాష కళ్లద్దాలు లాంటిది

యువత దేశానికి భవిత, ఐక్యమత్యంతో ఉండాలి

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

ముషీరాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి):  మారుతున్న పరిస్థితులను బట్టి ఎన్ని భాషలునైనా నేర్చుకో వచ్చునని, తల్లి లాంటి మాతృ భాష మాత్రం అన్నిటికంటే ముందు ఉండాలలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. మాతృభాష తెలుగు కంటిచూపు లాంటిదని, ఇంగ్లీష్ భాష కంటి అద్దాలు లాంటిదన్నారు. మాతృభాషలో మాట్లాడటం అలవాటు చేసుకోవాలని ఆయ న సూచించారు.

హైదరాబాద్ ఆర్టిసీ కళా భవన్‌లో సోమవారం దుర్గభాయ్ దేశ్‌ముఖ్ ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని   నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఐక్యమత్యం లేకపోవడం కారణంగా చిన్నచిన్న దేశాలతో పాటు బ్రిటిష్ వారు వచ్చి మనల్ని ఆక్రమించి వందల సంవత్సరాల పాటు బానిసలుగా తయారు చేసి పోయారన్నారు.

అందుకే యువత దేశానికి భవిత అని దృష్టిలో పెట్టుకొని  ఐక్యమత్యంతో ఉండాలని వెంకయ్య నాయుడు సూచించారు. యువత సమయాన్ని వృథా చేయకుం డా జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితంలో ఎదిగేందుకు  పోటీతత్వం అవసరమని, ఆ పోటీ తత్వం స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఎదిగిన తర్వాత అందరూ కలిసి ఉండాలన్నారు.

ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని సమాజ సేవ అందించాలన్నారు. పెరుగుతున్న వయసును దృష్టిలో పెట్టుకొని మానసిక ఉల్లాసం ఆరోగ్యానికి  వ్యాయామము, యోగా తప్పనిసరిగా చేయాలని సూచించారు. అదే విధంగా సగం సమయం చదువుతో పాటు సగం సమ యం ప్రజల్లో కలిసి ఉండాలన్నారు.  ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేద న్నారు క్రమశిక్షణతో అలవాటు చేసుకొని యువత మహోన్నతులు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిడిఎంఎస్ ప్రెసిడెంట్ ఉషా కంద, డిడిఎంఎస్ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు, ఏపీ విశ్రాంతి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్. కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ కే. లక్ష్మి సుందరి, డీడిసిఓపి డాక్టర్ పి. స్రవంతి పాల్గొన్నారు.