27 February, 2026 | 1:41 AM

అధిష్ఠానం చుట్టూ ఆశావహులు

27-02-2026 12:00 AM
  1. పెద్దల సభకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని కాంగ్రెస్ 
  2. రాజ్యసభ సీటు కోసం హస్తినలో నేతల మకాం 
  3. ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
  4. దాఖలు కాని నామినేషన్లు
  5. ఖాళీ అయ్యే రెండింటిలో అభిషేక్ సింఘ్వీకి రెన్యువల్..? 
  6. మిగిలిన ఒక సీటు కోసం అరడజన్‌కుపైగా ఆశావహులు 

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు పెద్దల సభకు సంబంధించి  నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రాజ్యసభకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మార్చి 5వ తేదీతో ముగుస్తోంది. అయి తే, ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు కాలేదు. అభ్యర్థుల ఎంపికలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ  ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఆశావహులు మాత్రం అ టు హస్తినలోని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను, ఇటు సీఎం రేవంత్‌రెడ్డి చుట్టూ, ఇతర నాయకుల మద్దతు కోసం  తిరుగుతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేయగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు హస్తినలోనే ఉండి పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు.  ఇక మరి కొందరు కూడా తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సిం ఘ్వీ, బీఆర్‌ఎస్‌కు చెందిన కేఆర్ సురేష్‌రెడ్డిల పదవి వచ్చే నెలాఖరులో ముగుస్తుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక సీటును గెలుచుకుంటుంది. రెండో సీటులో విజయం సాధించుకునేందుకు ఇతర పార్టీల మద్దతు అవవసరం. కాంగ్రెస్‌కు ఎంఐఎం, సీపీఐతోపాటు బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన శాసనసభ్యుల మద్దతుతో కాంగ్రెస్ ఖాతా లో వేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు మంతనాలు సాగిస్తున్నారు.

ఖాళీ అవుతున్న రెండు సీట్ల లో  ఒక సీటు ఏఐసీసీ ఖాతాలో అభిషేక్ సింఘ్వీ ని రెన్యువల్  అయ్యే అవకాశం ఉంది. అభిషేక్ సింఘ్వీ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా.. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన కేసులుంటే సుప్రీంకోర్టులో ఆయన సేవలను కాంగ్రెస్ వినియోగించుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వానికి సం బంధించిన పలు కేసులను కూడా సుప్రీంకోర్టులో వాదించారు. అందుకు ఖాళీ అవుతున్న రెండింటిలో.. సింఘ్వీ సీటు రెన్యువల్ అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. 

అరడజన్‌కుపైగా.. 

 ఇక రెండో సీటు కోసం అరడజన్‌కుపైగా ఆశావహులు ఆశిస్తున్నారు. ఓసీ వర్గం నుంచి  జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి,  సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జెట్టి కుసుమ కుమార్,  మైనార్టీ వర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఉన్నారు.

ఇక బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్,  ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్యనాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు  తదితరులున్నారు. అయితే ఇటీవలనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన జస్టిస్  సుదర్శన్‌రెడ్డిని పెద్దల సభకు పం పించాలనే ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే పార్టీలోని మరొక వర్గం మాత్రం పార్టీలో క్రియాశీలకంగా పని చేసే సీనియర్ నాయకులకే రాజ్యసభకు  అవకాశం కల్పించాలనే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు  సంబంధంలేని వారిని పెద్దల సభకు పంపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా, భవిష్యత్‌లో పార్టీకి తీరని నష్టం జరుగు తుందనే  అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీసీలకు అవకాశం ఇవ్వాలని.. 

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్ల భర్తీలో సామాజిక న్యాయం పాటించా లనే డిమాండ్  బలంగా వినిపిస్తోంది. ఏఐసీసీ కోటాలో భర్తీ కానున్న అభిషేక్ సింఘ్వీకి మళ్లీ రెన్యువల్ చేస్తే.. ఆయన ఓసీ కేటగిరలోకి వెళ్తారనే, ఇక రెండో సీటు రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అవకాశం ఇవ్వాలని సొంత పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాలు కూడా కో రుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత రాజ్యసభలో అడుగుపెట్టిన వర్గాలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దల సభకు ఎస్సీ సామాజిక వర్గాకి అవకాశాలు దక్కేవని, రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీలను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదనే విమర్శ లున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గాన్ని మాత్రం పట్టిం చుకునే నాథుడే కరువయ్యారనే విమర్శలు న్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల ను రాజకీయ పార్టీలన్నీ విస్మరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


 వీహెచ్, కుసుమకుమార్‌కు అవకాశమివ్వండి

* ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లను రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలకు అవకాశం ఇవ్వాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వినతిపత్రం అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయకుడు  కుసుమకుమార్ ఇద్ద రు పార్టీ కోసం పని చేస్తున్న నాయకులని, వీరి కి అవకాశం ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని తెలిపారు.

వీహెచ్ అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పని చేయడమే కాకుండా గాంధీ కుటుంబానికి లాయల్‌గా ఉంటారని తెలిపా రు. వీహెచ్ వయసులో పెద్ద వ్యక్తి కాబట్టి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు జగ్గారెడ్డి చెప్పారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమకుమార్ కూడా ఎన్‌ఎస్‌యూఐ, యూ త్ కాంగ్రెస్‌తో పాటు ప్రస్తుతం పార్టీలోనూ కీలకంగా ఉన్నారని వివరించారు.  పార్టీలో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు.