ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి
మొయినాబాద్ (ఆగస్టు 5)(విజయక్రాం తి): ఆధునిక డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు మరియు యువ త నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఫ్యూ చర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జో షి, ఐపీఎస్ పిలుపునిచ్చారు.
మొయినాబాద్లోని విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ (వీజేఐటీ)లో బుధవారం సైబర్ జాగ్రుక్తా దివస్2026 సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆన్లైన్లో వచ్చే తెలియని, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సీపీ సూచించారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, సందేశాలను నమ్మి బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఏవైనా సైబర్ మోసాలు జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఈ సందర్భంగా సీపీ స్పష్టం చేశారు.






