2 June, 2026 | 10:38 PM

రెండు బైక్ లు ఢీ ఒకరు మృతి

02-06-2026 08:57 PM

చేర్యాల: చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామ శివారులో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీ కొనడం వల్ల ఒకరు అక్కడి కక్కడే మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడినారు. స్థానికులు తెలిపిన  వివరాల ప్రకారం గుర్జకుంట గ్రామానికి చెందిన ఎర్ర నర్సింహులు (33) బైక్ పై గుర్జకుంట నుంచి చేర్యాల వైపు వస్తున్న క్రమంలో అదే రోడ్డు పై ఎదురుగా బైక్ పై వస్తున్న నంగిరాజు, బండారి రమేష్ లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఎర్ర నర్సింహులు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నంగి రాజు, బండారి రమేష్ లను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. గుర్జకుంట శివారు రహదారి పక్కనే వ్యవసాయ పొలం వద్ద ఓ రైతు వరి కొయ్యలు తగల పెడ్డడం వల్ల వచ్చిన పొగవల్ల రోడ్డుపై ఏమి కనపడక పోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుకుంటున్నారు.