నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు
19-03-2026 02:22 AM
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): తెలంగాణలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, నిషేధిత జాబితాలో దాదాపు కోటి ఎకరాలు చేరిందని, అది ఎలా చేరిందో చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సెటిల్‌మెంట్లు, భూదందాలు చేసుకోవడానికే చేర్చారని ఆయన ఆరోపించారు. ఈ జాబితాపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంట్ పెద్ద జోక్‌లా మారిందని, రూ.10 వేల కోట్ల మేర సర్కార్ బాకీ పడిందని తెలిపారు. ఇంతపెద్ద మొత్తంలో బాకీ పడటంతోనే ఈ స్కీమ్‌ను ఎత్తేస్తారనే లీకులు వినిపిస్తున్నాయని ఆరోపించారు.




